Saturday, April 27, 2024

62 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన డయానా మేనకోడలు

సాధారణంగా రాజవంశంలో ఎటువంటి శుభకార్యాలు జరిగినా అవి విశేషాలే. సోషల్ మీడియాలో ప్రిన్సెస్ డయానా మేనకోడలు లేడీ కిట్టీ పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే 30 ఏళ్లు కూడా లేని ఆమె 62 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడింది. లేడీ కిట్టీ.. ప్రిన్సెస్ డయానా సోదరుడు చార్లెస్ స్పెన్సర్ కుమార్తె. ఆమె 62 ఏళ్ల మైఖేల్ లూయీస్‌ను పెళ్లి చేసుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఆయన ఫ్యాషన్ వ్యాపారవేత్త. వేలాది కోట్ల శ్రీమంతుడు. మైఖేల్‌కు కిట్టీకి 2018 నుంచే పరిచయం ఉంది.

వీరిద్దరి వయస్సు మధ్యా చాలా తేడా ఉన్నా ప్రేమకు వయస్సు అడ్డురాదు అన్నట్లుగా వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో జులై 24,2021న ఇటలీలోని ప్రాస్కాటిలోని విలలా అల్డోబ్రాండినిలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. నవ్వుతూ తుళ్లుతూ మైఖేల్ తో కిట్టీ ఎంతో సంతోషంగా ఉంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ డోల్స్ అండ్ గబ్బానా రూపొందించిన గౌన్లు ధరించిన కిట్టీ పెళ్లి వేడుకలో దేవకన్యలా కనువిందు చేస్తూ మెరిసిపోయింది.

ఈ వార్త కూడా చదవండి: ప్రపంచంలో సమంతాదే అతిపెద్ద నోరు

Advertisement

తాజా వార్తలు

Advertisement