Friday, April 26, 2024

వకీల్ సాబ్ 4th ప్లేస్…ఫస్ట్ ఎవరో తెలుసా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే నివేదా థామస్, అంజలి కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా ఇటీవల టీవీలో ప్రసారం అయింది. 18వ తేదీన జీ తెలుగు లో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాగా 19.12 టిఆర్పి రేటింగ్ వచ్చింది.

ఇది మంచి టిఆర్పి రేటింగ్ అయినప్పటికీ…వకీల్ సాబ్ 4వ స్థానంలో నిలిచింది. మొత్తం జీ తెలుగులో ప్రసారం అయిన వాటిలో మొదటి స్థానంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు 22.54 ,అలాగే రెండవ స్థానంలో అల్లు అర్జున్ డీజే 21.7 రేటింగ్ తో నిలిచింది. ఇక మూడవ స్థానంలో గీతగోవిందం 20.8 తో రేటింగ్ తో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement