Saturday, May 18, 2024

BWF Championships | ప్రణయ్ vs విటిడ్సర్న్.. నేడే సెమీ-ఫైనల్

ప్రస్తుతం జరుగుతున్న BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2023లో సెమీ-ఫైనల్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుట్ విటిడ్‌సర్న్‌తో తలపడబోతున్నాడు.

నిన్న (శుక్రవారం) జరిగిన ఉత్కంఠభరితమైన 68 నిమిషాల పోరులో.. రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన డెమార్క్ అక్సెల్సెన్‌కి క్వార్టర్ ఫైనల్‌లో షాక్ ఇచ్చి సెమీస్ లో త‌న స్థానాన్ని రిజర్వ్ చేసుకున్నాడు ప్ర‌ణ‌య్. ఇక ఈ విజయం ప్రపంచ ఈవెంట్‌లో టాప్ 3 లో ప్లేస్ సంపాదించి కాంస్యం క‌న్ఫామ్ చేసుకున్నాడు. ఇక సెమీస్ లోనూ ఇదే జోరు కొన‌సాగిస్తే టోర్నమెంట్‌లో మరింత మెరుగైన‌ ప్లేస్ లో నిలిచే చాన్స్ ఉంది.

కాగా, వరల్డ్ ఛాంపియన్‌షిప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ ఇవ్వాల (శనివారం) జరుగుతుంది. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లోని రాయల్ అరేనా – కోర్ట్ 1లో HS ప్రణయ్ vs కున్లావుట్ విటిడ్‌సర్న్ మ‌ధ్య మ్యాచ్ 6.20 IST గంటలకు ప్రారంభం కానుంది.

BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ JioCinema యాప్, వెబ్‌సైట్‌తో పాటు భారతదేశంలోని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధికారిక YouTube ఛానెల్, BWF TVలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement