Monday, April 29, 2024

2023లో రిలీజ్ కానున్న ప్రభాస్ ఏకైక మూవీ స‌లార్.. ఆదిపురుష్ వాయిదా పడనుందా?

ఆదిపురుఫ్‌ టీజర్ రిలీజ్ ట్రోల్స్ కి గురైనప్పటినుంచి ప్రభాస్ మూవీ లైనప్ ఒక్కసారిగా మారిపోయింది. రానున్న సంవత్సరం జనవరిలో ఓం రౌత్‌ డైరెక్ట్ చేసిన ఆదిపురుష్ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ఇటీవలే ఈ మూవీ జూన్ 2023కి సోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు టాలివుడ్ లో మరో చర్చ మొదలైంది.. వచ్చే ఏడాదిలో ప్రభాస్ మూవీ లైైనప్ నుండి ‘స‌లార్’ మాత్రమే విడుదల కానున్న‌ట్టు స‌మాచారం అందుతోంది.

ఆదిపురుష్ మూవీ కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారు మేకర్స్.. దాంతో పాటు అధిక మొత్తంలో VFX, CGI కూడా వాడారు. దురదృష్టవశాత్తు, ఇంత అదునిక టెక్నాలజీ ఉపయోగించి కూడా.. ఫస్ట టీజర్ కు కార్టూన్‌ లుక్ ఇవ్వడంతో అభిమానుల అంచనాలను అందుకోవడంలో మూవీ టీమ్‌ బోల్తా కొట్టింది. అన్ని విమర్శల తర్వాత, ఇప్పుడు మేకర్స్ సినిమాపై మళ్లీ పని చేస్తున్నారు… దీంతో ఈ సినిమా విడుదల మరింత వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేకులు. కాబట్టి, 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కు ప్లాన్ చేసిన స‌లార్.. వచ్చే ఏడాది విడుదలయ్యే ప్రభాస్ లైనప్ లో ఏకైక మూవీ కానుంది. మరి స‌లార్, ఆదిపురుష్ రిలీజ్ ప్లాన్స్ గురించి వచ్చిన రిపోర్ట్ నిజమో కాదో వేచి చూద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement