Tuesday, May 7, 2024

పాయ‌ల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో మంగ‌ళ‌వారం.. పోస్ట‌ర్ రిలీజ్

హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోన్న చిత్రం మంగ‌ళ‌వారం.ఈ చిత్రాన్ని దర్శకుడు అజయ్ భూపతి తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఏ విషయాలను రివీల్ చేయకుండా ఆయన టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హీరోయిన్ ను ఆయన సీతాకోకచిలుక మాదిరిగా చూపించారు. ఈ రోజు మంగళవారం కావడంతో, ‘మంగళవారం’ టైటిల్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హారర్ టచ్ ఉన్న జోనర్లో ఈ కథ నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే నాయిక ప్రధానమైన ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ని తీసుకున్నార‌ట‌. స్వాతి – సురేశ్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి, అజనీశ్ లోక్ నాథ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement