Friday, April 26, 2024

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హాస్టల్‌ వెల్ఫేర్‌, వార్డెన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న పలువురు అభ్యర్థుల దరఖాస్తుల్లో తప్పులు దొర్లడంతో వారి విజ్ఞప్తుల మేరకు ఎడిట్‌కు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు అవకాశం కల్పించారు. ఈనెల 17 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్‌ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

581 పోస్టులకు గానూ గతేడాది డిసెంబర్‌ నెలలో టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసి ఈ ఏడాది జనవరి 6 నుంచి 27 వరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మంగళవారం అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగ నియామక పరీక్ష జరిగింది. ఉదయం సెషన్‌కు 73.04 శాతం, మధ్యాహ్నం సెషన్‌కు 72.74 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement