Sunday, May 5, 2024

జూన్ 7న బృహ‌దేశ్వ‌రా టెంపుల్‌లో – పొన్నియ‌న్ సెల్వ‌న్ టీజ‌ర్ రిలీజ్

నాలుగేళ్ల త‌ర్వాత స్టార్ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. కాగా ఇండియాలో ఎంత పెద్ద స్టార్ అయినా మ‌ణిర‌త్నంతో ఒక్క సినిమా చేయాల‌ని ఆశ ప‌డుతుంటారు. ప్ర‌స్తుతం ఈయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం పొన్నియున్ సెల్వ‌న్‌. త‌మిళ స్టార్ చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్ర మొద‌టి భాగం సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ టీజ‌ర్ డేట్‌ను వెల్ల‌డించారు. జూన్ 7న తంజావూరులోని బృహ‌దేశ్వ‌రా టెంపుల్‌లో విడుద‌ల చేయ‌నున్నారని టాక్. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో కలిసి మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై మ‌ణిర‌త్నం స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు. తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement