Monday, May 13, 2024

తిరుపతి బాలుడి కిడ్నాప్ కథ సుకాంతం…ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం

అలిపిరి కిడ్నాప్ కు గురైన బాలుడి కిడ్నాప్ కేసును సుకాంతం అయింది. తల్లిదండ్రులు చెంతకు బాలుడిని పోలీసులు చేర్చారు. ఇదే విషయమై తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పల నాయుడు మాట్లాడుతూ…ఫిబ్రవరి 27న తిరుపతిలో బాలుడు శివకుమార్ సాహు అదృశ్యమయ్యాడు. ఛత్తీస్ గఢ్ లో గరియాబాద్ నుంచి మొత్తం 55 మంది విహార యాత్రలో భాగంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. విజయవాడ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలు దర్శించుకుని ఆ బృందం తిరుపతికి వచ్చింది. దర్శన టికెట్లు లేకపోవటంతో అలిపిరి లింక్ బస్ స్టాండ్ లో బస చేశారు. ఆ సమయంలో తన కుమారుడు కనిపించటం లేదని బాలుడి తండ్రి ఫిర్యాదు చేశారు. బాలుడి అదృశ్యం కు సంబంధించిన ఆధారాలు దొరకపోడంతో పలు కోణాల్లో దర్యాప్తు చేశాము.

బాలుడి కోసం ఏపీతో పాటు, కర్ణాటక,తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టాం. శనివారం విజయవాడ లో బాలుడి ఆచూకీ లభించింది. సాంకేతిక సహాయంతో కిడ్నాపర్ కర్ణాటక లోని కోలార్ జిల్లా,నగిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్టనహళ్ళి కి చెందినవాడిగా గుర్తించామని అన్నారు.

నిందితుడే బాలుడిని విజయవాడలో వదిలి వెళ్లినట్లు భావిస్తున్నామని. బాలుడి గుర్తింపును మార్చే పలు ప్రయత్నాలు జరిగాయని తెలిసింది. నిందితుడి ఉదేశ్యం ఏంటో ఇప్పటికీ అర్థం కాలేదు. నిందితుడి కుమారుడు ఇటీవలే చనిపోయాడు. పిల్లాడిని పెంచుకోవటానికి కిడ్నాప్ చేశాడా…లేదా అపహరణ కోసమా అనేది తేలాల్సి ఉందన్నారు.

ఇక బాబు ను తల్లిదండ్రులు దగ్గరకు చేర్చడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. కన్నీటి బాష్పలతో కృతజ్ఞతలు పోలీసులకు కృతజ్ఞత తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement