Monday, April 29, 2024

పడకేసిన పోలవరం, 500 కోట్ల నిర్వాసితుల సొమ్ము ఎక్కడ?.. టీడీపీ నేత బొండా ఉమా

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం ప డకేసిందని, ఎన్నో పోరాటాలతో ఈ ప్రాజెక్ట్‌ ను సాధించుకున్న ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పూర్తికి నోచుకోలేదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సోమవారాన్ని పోలవరంగా మార్చి చంద్రబాబు పనులు పరిగెత్తించారని చెప్పారు. 70శాతం పనులు పూర్తి చేసిన మిగిలిన పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆరోపించారు. తెలుగుదేశం హయాంలో పోలవరం పనులు పక్కాగా జరిగాయని రూ. 11వేల కోట్లను ప్రాజెక్ట్‌ కోసం ఖర్చు చేశారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేసిందన్నారు.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రాజెక్ట్‌ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్ధితికి తీసుకొచ్చిందని విమర్శించారు. రివర్స్‌ టెండర్ల పేరుతో దాదాపు రూ. 21 వేల కోట్లు వృధా చేశారన్న నివేదికలు కూడా వచ్చాయని బొండా ఉమా తెలిపారు. కేంద్ర జలవనరుల శాఖ నుంచి పీపీఎ వరకు ప్రభుత్వ అసమర్ధతను ఎత్తి చూపుతుందని వ్యాఖ్యానించారు. పోలవరం నిర్వాసితులకు గతంలో సీఎం జగన్‌ ఎన్నో హామీలు ఇచ్చారని వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మాట తప్పారని అన్నారు. పోలవరం నిర్వాసితుల కోసం కేటాయించిన రూ. 500 కోట్లు ఎక్కడికి వెళ్ళాయని నిలదీశారు. మరో వైపు వరద బాధితులకు ప్రభుత్వ తరుపు నుంచి కనీస సాయం అందలేదని విమర్శించారు. ఈ మూడేళ్ళలలో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి నిర్వాసితులకు ఎంత ఖర్చు చేసిందన్న వివరాలను శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాలని బొండా ఉమా డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement