Monday, April 29, 2024

కేంద్ర ప్రభుత్వ పరిధిలో పోలవరం పరిహారం.. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి 2 వేల కోట్లు అవసరం

చింతూరు, (అల్లూరి ) ప్రభన్యూస్‌: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు చెల్లించే పరిహారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. చింతూరు మన్యంలో వరదల వలన ముంపునకు గురైన బాధితులను పరామర్శించేందుకు బుధవారం చింతూరు మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని ఏపీఆర్‌ ప్రాంగాణంలో హెలికాఫ్టర్‌ దిగి, అక్కడ ఏర్పాటు చేసిన వరదలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని సందర్శించి వరదలు సంబవించిన విధానం, వరదల వలన చేకూరిన నష్టాన్ని పరీశీలించారు.

ఈ క్రమంలో కుయుగూరు, చట్టీ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరద బాధితులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరై వరద బాధితులను అప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మీరు చేసిన త్యాగం మరవలేనిది ….. మీ త్యాగాల వలన రాబోయే కాలంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. పోలవరం పరిహారం విషయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని పరిహారం ఇవ్వండని అడిగాను,. కేంద్రంతో యుద్ధం చేస్తున్నాను త్వరతిగతిన పరిహారం ఇవ్వాలని తాను కూడా ప్రధాన మంత్రి దృష్ఠికి తీసుకెళ్ళాను అన్నారు. ఈ వరదల వలన ప్రజలు నష్టపోయిన విషయాన్ని ప్రధాని దృష్ఠికి తీసుకెళ్ళి పరిహారం ఇవ్వాలని అడుగుతాను అన్నారు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి ప్యాకేజీ చెల్లించేలా తీవ్రంగా కృషి చేస్తానని అన్నారు. పోలవరం పరిహారం చెల్లించే వరకు ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పడనియ్యను, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన పరిహారం చెల్లించే వరకు ప్రాజెక్టులో నీరు నిలపకుండా చూసే బాధ్యత నాది అన్నారు.

కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వని పక్షంలో విలీన మండలాల్లోని 41.15 కాంటూర్లో ఉన్న గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సెప్టెంబర్‌ నెలలో పరిహారం చెల్లించి పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం సుమారు 2 వేల కోట్ల రూపాయాలు అవసరం ఉందని దాని వలనే ఇన్ని ఇబ్బందులు పడుతున్నామని అదే 1000 లేదా 2000 కోట్లయితే నేనే పరిహారం చెల్లించేవాడని అన్నారు. ఇది మన ప్రభుత్వమని, ప్రజల ప్రభుత్వమని ప్రజలకు న్యాయం చేయాలనే చూస్తానే తప్ప అన్యాయం చేయనని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement