Sunday, April 28, 2024

ఇండియన్ మార్కెట్ లో ‘పోకో ఎక్స్5 ప్రో 5జీ’.. ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లు ఇవే !

మిడ్ రేంజ్‍లో ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో పోకో నయా 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. భారత్‍లో సోమవారం (ఫిబ్రవరి 6) పోకో ఎక్స్5 ప్రో 5జీ లాంచ్ అయింది. క్వాల్‍కామ్ స్నాప్‍డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను ఈ మొబైల్ కలిగి ఉంది. 6.67 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ ఎక్స్‌ఫినిటీ అమోలెడ్ డిస్‍ప్లేతో వస్తోంది. లాంచ్ ఆఫర్ కింద, పోకో ఎక్స్5 ప్రో 5జీకి ఓ బ్యాంక్ కార్డు ఆఫర్ కూడా ఉంది. Poco X5 Pro 5G ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే.

పోకో ఎక్స్5 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు

6.67 ఇంచుల అమోలెడ్ డిస్‍ప్లేని పోకో ఎక్స్5 ప్రో 5జీ కలిగి ఉంది. 120 హెర్ట్జ్ అటాప్టివ్ రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, హెచ్‍డీఆర్ 10+ సపోర్ట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్.. డిస్‍ప్లే ఫీచర్లుగా ఉన్నాయి. స్నాప్‍డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ నయా పోకో ఫోన్ రన్ అవుతుంది.

- Advertisement -

పోకో ఎక్స్5 ప్రో 5జీ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. 108 మెగాపిక్సెల్ ISOCELL HM2 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ మొబైల్‍ను పోకో ఇచ్చింది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‍తో Poco X5 Pro 5G వస్తోంది.

పోకో ఎక్స్5 ప్రో 5జీ మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో ఈ ఫోన్ వస్తోంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది.

పోకో ఎక్స్5 ప్రో 5జీ ధర, సేల్, ఆఫర్

పోకో ఎక్స్5 ప్రో 5జీ ఫోన్ రెండు వేరియంట్లలో విడుదలైంది. 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.22,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ టాప్ మోడల్ ధర రూ.24,999గా ఉంది. ఆస్ట్రల్ బ్లాక్, హారిజన్ బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్‍లలో ఈ మొబైల్ లభిస్తుంది. నేడు కాసేపు సేల్ ఉండనుంది. ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్‌ (Flipkart)లో Poco X5 Pro 5G పూర్తిస్థాయిలో సేల్‍కు వస్తుంది.

పోకో ఎక్స్5 ప్రో 5జీ ఫోన్‍ను ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే రూ.20,999కే బేస్ వేరియంట్‍ను దక్కించుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement