Thursday, March 28, 2024

Telangana | రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో వైద్యారోగ్యశాఖకు కేటాయింపులు: డీహెచ్ శ్రీ‌నివాస‌రావు

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే వైద్యారోగ్యశాఖకు రికార్డు స్థాయిలో రూ.12,161 కోట్ల నిధుల‌ను ప్రభుత్వం కేటాయించిందని, ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు డైరెక్టర్‌ హెల్త్‌ శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. గతేడాదితో పోల్చితే రూ.721 కోట్లు అధికంగా కేటాయింపులు జరిగాయన్నారు. ఇందుకు కృషిచేసిన మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలుతెలిపారు. తాజా బడ్జెట్‌ కేటాయింపులు ఆరోగ్య తెలంగాణ దిశగా మరింత దోహదం చేస్తాయ‌న్నారు. వైద్యరంగంలో మ‌రిన్ని విప్లవాత్మక మార్పులకు శ్రీ‌కారం చుట్టబోతున్నాయని, జిల్లాకో మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. వాటికి అనుబంధంగా న‌ర్సింగ్ కాలేజీల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం హర్షణీయమన్నారు.

ఈ నిర్ణయం రాష్ట్రంలో వైద్య విద్యను మెరుగుప‌రచ‌డంతోపాటు తెలంగాణ బిడ్డలకు ఉపాధి కల్పనకు బాటలు వేస్తుందని డీహెచ్ అన్నారు. గ‌ర్భిణుల్లో ఎనీమియా నివార‌ణ‌కు తొమ్మిది జిల్లాల్లో ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ల ప‌థ‌కాన్ని రాష్ట్రమంతా విస్తరించడం గొప్ప విషయమన్నారు. రూ.200కోట్లతో 4లక్షల మంది గర్భిణులకు పథకం వరం కానున్నదన్నారు. ప్రస్తుతం ఉన్న బస్తీ దవాఖానాలకు అదనంగా మరో వంద బస్తీ దవాఖాలను ఏర్పాటు చేస్తుండడంతో వైద్యం మరింత చేరువకానున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని వైద్యారోగ్య శాఖ సిబ్బంది మ‌రింత ఉత్సాహంతో ప‌నిచేసి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా కృషి చేసి ఆరోగ్య తెలంగాణ లక్ష్యం సాకారం చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement