Wednesday, May 1, 2024

బైక్ పై లాప్ టాప్ లో వ‌ర్క్ చేస్తూ ప్ర‌యాణించిన వ్య‌క్తి – వైర‌ల్ గా ఫొటో

ఓ వ్య‌క్తి బైక్ పై ప్ర‌యాణిస్తూ లాప్ ట్యాప్ లో వ‌ర్క్ చేయ‌డం వైర‌ల్ అవుతోంది. ఏ అర్జెంట్ వ‌ర్క్ ఉందో ఏమో తెలీదు గానీ పాపంపై బైక్ పై ప్రయాణిస్తూనే ప‌ని చేశాడు.ఈ సంఘ‌ట‌న బెంగళూరులో చోటు చేసుకుంఇ. ఆ స‌మ‌యంలో అంద‌రూ అంద‌రూ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్నారు. అదే స‌మ‌యంలో హ‌ర్షీమీత్ సింగ్ అనే వ్య‌క్తి కూడా రోడ్డుపై ప్ర‌యాణిస్తున్నాడు. కానీ అత‌డి క‌ళ్ల‌కు ఓ వ్య‌క్తి విచిత్రంగా క‌నిపించాడు. బైక్ పై ప్రయాణిస్తూ ల్యాప్ టాప్ లో వ‌ర్క్ చేసుకుంటున్నాడు. దీంతో ఆయ‌న ఆ వ్య‌క్తి ఫొటో తీసి లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. ఈ పోస్ట్ కు క్రేజీ క్రేజీ కామెంట్స్ వ‌స్తున్నాయి.

ఈ  ఫొటోకు బెంగళూరు అత్యుత్తమంగా ఉందా లేదా చెత్తగా ఉందా ? 11pm బెంగళూరు  నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఫ్లైఓవర్‌లలో ఒకటి.  ఇక్కడ ఒక పిలియన్ రైడర్ తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్నాడు. ఒక బాస్‌గా మీరు టార్గెట్ రీచ్ కావ‌డానికి మీ సహోద్యోగుల భ‌ద్ర‌త‌ను ఫ‌ణంగా పెట్టి, వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న‌ట్ల‌యితే మీరు మళ్లీ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా మీరు ఆదేశించే స్థాయిలో ఉన్న‌ట్ల‌యితే ‘IT’S URGENT’, ‘DO IT ASAP’ అనే పదాలను మరింత జాగ్రత్తగా ఉప‌యోగించుకోవాలి. ఈ మాటలు మీ కింది ఉద్యోగుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మీకు తెలియదు”  అని హ‌ర్షీమీత్ సింగ్ క్యాప్ష‌న్ పెట్టాడు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement