Monday, May 6, 2024

రైతు భ‌రోసా కేంద్రాల్లో వేరుశనగ విత్తనాలు.. కోస్తా, రాయలసీమల్లో ప్రత్యేక ప్లాన్​

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రా కోస్తా జిల్లాల్లో వరి.. రాయలసీమలో వేరుశెనగ.. ఖరీఫ్‌లో ప్రధానంగా గుర్తుకొచ్చేది ఈ రెండు పంటలే. ఈ ఏడాది జూన్‌ ప్రారంభం నుంచే సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించటంతో రైతాంగం సేద్యానికి సన్నద్ధమవుతోంది. వరి కన్నా ముందు రాయలసీమలో వేరుశెనగ సాగు ప్రారంభమవుతుండటంతో రైతు భరోసా కేంద్రాల్లో డిమాండ్‌కు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఖరీప్‌లో వేరుశెనగ సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని 18.40 లక్షల ఎకరాలుగా నిర్ధారిం చటంతో విత్తనాలను జిల్లాల వారీగా అవసరాల మేరకు ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతున్నారు.

కె-6, నారాయణి, కదిరి లేపాక్షి (కె-1812) రకాలను వివిధ ప్రాంతాల్లో సాగుకు వినియోగిస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా 3,95,761 క్వింటాళ్ల విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధం చేసిన 3,95,761 క్వింటాళ్ల విత్తనాల్లో కె-6 రకం విత్తనాలను 3,40,843 క్వింటాళ్ల మేర అందుబాటులో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. ఒక కిలో విత్తనాలపై ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ప్రకటించింది. మార్కెట్లో కేజీ రూ.85.80 ధర పలుకుతున్న విత్తనాలను సబ్సిడీ పోను కిలో రూ.51.48కి రైతులకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement