Friday, April 26, 2024

Pawan birthday: మరోసారి కరో కరో జర జల్సా అన్న DSP

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే విషేస్ తో సోషల్ మీడియా ఊగిపోతోంది. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మెగా అభిమానులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో గతంలో ‘జల్సా’ సినిమా వచ్చిన విషయం. ఆ మూవీ మ్యూజిక్ అప్పట్లో ఒక సంచలనం. తాజాగా మళ్లీ దేవిశ్రీ ప్రసాద్ ఆ రోజులను గుర్తు తీసుకొచ్చాడు. పవన్ బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తూ అప్పట్లోనే ఈ వీడియోను సినిమా ప్రమోషన్స్ కోసం తయారు చేశామని, కానీ పలు కారణాల వల్ల ఈ వీడియో రిలీజ్ చేయలేకపోయామని చెప్పుకొచ్చాడు. కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నిర్మాత అల్లు అరవింద్ చొరవతో ఈ వీడియోను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం అంటూ టైటిల్ ట్రాక్ ప్రమోషనల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశాడు. ఇక పవన్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు సినిమాలో నుంచి సరికొత్త అప్డేట్స్ ప్రకటించడానికి మేకర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు.

YouTube video

ఇది కూడా చదవండి: అమెరికా తెలివి..ఆయుధాలు తాలిబన్లు వాడకుండా నిర్వీర్యం

Advertisement

తాజా వార్తలు

Advertisement