Thursday, April 25, 2024

అమెరికా తెలివి..ఆయుధాలు తాలిబన్లు వాడకుండా నిర్వీర్యం

అమెరికా దళాలు ఆప్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోయాయి. అయితే 20 సంవత్సరాల నుంచి ఆఫ్గాన్ లో ఉంటున్న అమెరికా సైనం కేవలం అతి తక్కువ రోజుల్లో కాబుల్ ను విడిచి వెళ్లింది. అయితే వెళుతూ వెళుతూ ఆయుధాలను కాబుల్ లోనే వదిలి వెళ్లింది సైన్యం. దీనిపై అమెరికా ప్రస్తుత ప్రభుత్వానికి స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పై విరుచుకుపడుతున్నారు. అయితే అమెరికా సైన్యం ఆఫ్గాన్ లో చాలా వరకు ఆయుధాలు, వాహనాలు, యుద్ద సామాగ్రి వదిలివెళ్లినప్పటికి తాలిబన్లకు వచ్చిన లాభం ఏం లేదని తెలుస్తోంది.

 ఆఫ్ఘ‌న్ ర‌క్ష‌ణ కోసం అమెరికా ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను ఖర్చుచేసి స‌మ‌కూర్చిన ఆధునాతన ఆయుధాలను వెన‌క్కి తీసుకెళ్లిన అమెరికా, చాలా ఆయుధాల‌ను ఆఫ్ఘ‌న్‌లోనే వ‌దిలేసింది.  అయితే, వాటిని చాలా వ‌ర‌కు నిర్వీర్యం చేసింది.  తిరిగి వినియోగించాలంటే దానికి త‌గిన టెక్నాల‌జీ, ఇంజ‌నీరింగ్ వ్య‌వ‌స్థ అవ‌స‌రం.  అమెరికా నిపుణులు త‌ప్పించి మ‌రోక‌రు వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకురాలేకుండా వాటిని మార్చేసింది.  అమెరికా వ‌దిలి వెళ్లిపోయిన వాహ‌నాల్లో చాలా వ‌ర‌కు తుక్కుగా మారిపోయాయి.  త‌ప్పించి వినియోగించేందుకు ఎందుకు ప‌నికిరావు. ఇలా తుక్కుగా మార్చిన వాటిల్లో విమానాలు, హెలీకాఫ్ట‌ర్లు, మందుపాత‌ర‌ల‌ను త‌ట్టుకోగ‌ల ఎంఆర్ఏపీ సాయుథ శ‌క‌టాలు, హామ్వీ ర‌వాణా వాహ‌నాలు, రాడార్ సీ రామ్ వ్య‌వ‌స్థ వంటి వాటిని అమెరికా సైనికులు నిర్వీర్యం చేశారు.  వీటిని వినియోగంలోకి తీసుకురావాలంతే తాలిబ‌న్ల‌కు కుద‌ర‌ని ప‌ని. 

ఇది కూడా చదవండి: సెప్టెంబరులో సాధారణం కంటే అధిక వర్షపాతం: ఐఎండీ

Advertisement

తాజా వార్తలు

Advertisement