Monday, May 6, 2024

కరోనా టెస్ట్ చేసుకోమంటే.. స్టేషన్ నుంచి పరుగో పరుగు!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గత మూడు రోజులుగా రెండు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే, కరోనా టెస్ట్‌ల నుంచి తప్పించుకునేందుకు కొందరు ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుంచి పరుగులు తీశారు. బిహార్‌లోని బక్సార్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చడంతో వివిధ ప్రాంతాల నుంచి బిహార్‌కు వచ్చే స్థానికులకు రైల్వే స్టేషన్‌లలో కరోనా పరీక్షల కోసం ఏర్పాట్లు చేయాలని సీఎం నితీశ్ కుమార్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు రైల్వే స్టేషన్‌లో స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. లాక్‌డౌన్ భయంతో ముంబయి, పుణే, ఢిల్లీల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు బిహార్‌కు చేరుకుంటున్నారు. అయితే, స్క్రీనింగ్ పరీక్షల కోసం ప్రయాణికులను ఆపుతుంటే వాగ్వాదానికి దిగుతున్నారు. పదుల సంఖ్యలో జనం రైల్వే స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు.

https://twitter.com/manishndtv/status/1383057461821673484
Advertisement

తాజా వార్తలు

Advertisement