Thursday, May 2, 2024

‘పప్పు’ అనే పదాన్ని నిషేధించిన అసెంబ్లీ

జాతీయ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా ‘పప్పు’ అనే పదం వినపడుతూ ఉంటుంది. దీంతో ఇప్పుడు ఈ పదం ప్రయోగించటంపై ఏకంగా అసెంబ్లీలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పదాన్ని ఇక అసెంబ్లీలో వాడకూడదని మధ్యప్రదేశ్ స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఈ మేరకు పప్పు, వెంటిలేటర్, మిస్టర్ బంటాధార్, చోర్ వంటి పదాలను సభలో పలకకుండా నిషేధం విధించింది. ఈ క్రమంలో సభలో ఏయే పదాలను పలకకూడదో వాటి జాబితాను మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ విడుదల చేశారు.

దీంతో 1954 నుంచి ఇప్పటి వరకు నిషేధిస్తూ వస్తున్న పదాలు, వాక్యాల సంఖ్య 1,161కి చేరుకుంది. వీటికి సంబంధించి 38 పేజీల బుక్ లెట్ ను ఎమ్మెల్యేలకు అందించారు. పప్పు అనే పదాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించేందుకు బీజేపీ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీలో వైసీపీ నేతలు సైతం మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఫాలో అవుతారా.. వారి నోటికి తాళం పడుతుందా అనే చర్చ మొదలైంది. ఎక్కువగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే రోజా టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్‌ను తిట్టేందుకు ‘పప్పు’ అనే పదాన్ని వాడుతుండటం తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: ఆఫ్రికాలో బయటపడ్డ మరో భయంకర వైరస్

Advertisement

తాజా వార్తలు

Advertisement