Friday, May 17, 2024

ఆఫ్రికాలో బయటపడ్డ మరో భయంకర వైరస్

ప్రపంచంలో ఇప్పటికే అనేక రకాల వైరస్‌తో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మరో భయంకరమైన వైరస్ బయటపడింది. తాజాగా ఆఫ్రికాలో మార్ బుర్గ్ అనే వైరస్ ప్రబలడంతో కలకలం రేపుతోంది. ఆఫ్రికాలోని గినియా దేశంలో మార్బర్గ్ వైరస్ కేసును గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ ప్రాణాంతక వైరస్ చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. గబ్బిలాల నుండి ప్రజలకు వ్యాపించే ఈ వైరస్ కారణంగా జ్వరం తీవ్ర తలనొప్పితో పాటు రక్తస్రావం అవుతోందని వైద్యులు చెబుతున్నారు.

ఈ వైరస్ సోకిన వారిలో 24 శాతం నుంచి 88 శాతం వరకు చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభంలోనే ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ పై పరిశోధనల‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందాన్ని పశ్చిమ ఆఫ్రికాకు పంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి కారణంగా ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో మంది ప్రజలు కరోనా బారిన పడి మృతి చెందారు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో డెల్టా వైర‌స్ కలకలం రేపుతోంది. క‌రోనా బారిన ప‌డి చాలామంది ప్ర‌జ‌లు ఆస్ప‌త్రుల్లో చేరుతున్నారు.

ఈ వార్త కూడా చదవండి: జగన్ ప్రభుత్వానికి కేంద్రం మరో ఝలక్

Advertisement

తాజా వార్తలు

Advertisement