Friday, April 19, 2024

పుష్ప ఫస్ట్ సింగిల్ ప్రోమో మాములుగా లేదు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే టీజర్ సోషల్ మీడియాలో దుమ్ముదులిపింది.

ఇదిలా ఉండగా రెండు పార్టులుగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ను డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ కు సంబంధించి ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేశారు. దాక్కో దాక్కో మేక అనే ఫస్ట్ సింగిల్ ను ఆగస్టు 13న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేర ఇప్పుడు ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా…తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement