Saturday, May 4, 2024

Big story | టమాటాతో పోటీపడనున్న ఉల్లి.. రేటు భారీగా పెరిగే చాన్స్

ప్ర‌స్తుతం మార్కెట్ లో టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి.. ఒక్క టమాటా మాత్రమే కాదు వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ధరలు కూడా భారీగా పెరిగాయి. అయితే త్వరలో ఉల్లి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. టమాటా ధరలు మార్కెట్ లో ఆకాశాన్నంటుతున్నాయి. మరికొద్ది వారాల్లో టమాటా ధర రూ.300కి చేరే అవకాశం ఉంది. ఇప్పుడు ఉల్లి కూడా అదే బాటలో పయనించే అవకాశం క‌నిపిస్తోంది. అక్టోబర్-నవంబర్ నాటికి ఉల్లిపాయల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయప‌డుతున్నారు. ప్రభుత్వం అప్రమత్తమై ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం కొంత ఊరటనిస్తుంది.

- Advertisement -

మ‌రో రెండు నెలల తర్వాత ఉల్లి ధరలు గణనీయంగా పెరగవచ్చని నేషనల్ కమోడిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా వివరించారు. ప్రస్తుతం మనం గత ఉత్పత్తుల నుండి నిల్వ చేసిన బఫర్ స్టాక్ నుండి ఉల్లిపాయలను ఉపయోగిస్తున్నామని, ఈసారి వర్షాలు సకాలంలో పడలేదు కాబ‌ట్టి అక్టోబర్-నవంబర్లలో ఈ అంతరాయం ప్రభావాన్ని చూస్తామని సంజయ్ గుప్తా చెప్పారు. వర్షాభావంతో శీతాకాలపు ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇది వేరు కూరగాయ కావడంతో పొలాల్లో నీరు చేరి కుళ్లిపోతుందని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ అగ్రికల్చర్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్ వివరించారు.

అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) & నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) ఇప్పటి వరకు 2.9 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను సేకరించినట్లు సమాచారం.

ఈ రెండు కేంద్ర ఏజెన్సీల కొనుగోళ్ల ప్రక్రియ మొత్తం మరో రెండు వారాల్లో పూర్తవుతుందని, NAFED, NCCF ద్వారా ఈ ఏడాది 3 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిని కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించిన‌ట్టు తెలుస్తోంది. గత ఏడాది ఒక్క NAFED ద్వారానే 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉల్లి బఫర్‌ స్టాక్‌ను రూపొందించింది. ఈసారి NCCF కూడా ఉల్లిని సేకరిస్తోంది. మార్కెట్‌లో ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్‌ను ఉపయోగిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement