Sunday, May 19, 2024

పాకిస్థాన్ ర‌హ‌దారుల‌పై.. ఆఫ్రికా ప‌క్షుల సంద‌డి..

ఆఫ్రికా దేశాల్లో త‌ర‌చూగా క‌నిపించే ప‌క్షి నిప్పుకోడి..అదేనండీ ఆస్ట్రిచ్..ఇవి పాకిస్థాన్ ర‌హ‌దారుల‌పై హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే ఇవి లాహోర్‌ సమీపంలోని అడవుల నుంచి తప్పించుకొని రెండు ఆస్ట్రిచ్‌లు రోడ్ల మీదకు వచ్చాయి. కెనాల్‌ రోడ్‌లో వాహనదారులకు పోటీగా వేగంగా పరుగెత్తుతూ అందరినీ ఆశ్చర్య పరిచాయి. దాంతో కొందరు వాహనదారులు వాటిని పట్టుకొని ..ఫోటోలు తీసుకోడానికి ప్రయత్నించడంతో మెడకు గాయమై ఒకటి మృత్యువాత పడినట్లు పాక్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ తెలిపింది.

దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మిలియన్‌ వ్యూవ్స్‌తో దూసుకుపోతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘చాలా వేగంగా పరుగెత్తుతుంది. ట్రాఫిక్‌లో ప్రతి రోజు ఉదయం బస్‌ను అందుకోవాడనికి నేను అలాగే పరుగెత్తుతాను. ఈ సందర్భాన్ని కేవలం కవ్‌బాయ్‌ మాత్రమే హ్యండిల్‌ చేయగలడు’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఎగరలేని పక్షి జాతుల్లో నిప్పుకోడి అతిపెద్దది. ఆకర్షణీయమైన ఈకలు, చర్మం కలిగి ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement