Thursday, April 25, 2024

అమ‌ర‌రాజా ప‌రిశ్ర‌మ కాలుష్యం వ్య‌వ‌హారంపై.. సుప్రీంకోర్టులో విచార‌ణ‌

అమ‌ర‌రాజా ప‌రిశ్ర‌మ తీవ్ర కాలుష్యం వెద‌జ‌ల్లుతోంద‌ని రాష్ట్ర పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫ్యాక్టరీ పరిసరాల్లోని జలాల్లో లెడ్ స్థాయులు పెరుగుతున్నాయంటూ నోటీసుల్లో పేర్కొంది. కాగా నేడు సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా అమరరాజా న్యాయవాదులు స్పందిస్తూ… రాజకీయ కారణాలతో వేధిస్తున్నారని తెలిపారు. షోకాజ్ నోటీసులపై ప్రజాభిప్రాయ సేకరణ చేసి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఇచ్చే ఉత్తర్వులను నాలుగు వారాల పాటు నిలుపుదల చేయాలని సూచించింది. పీసీబీ నోటీసులపై న్యాయ పరిష్కారాల కోసమే ఈ నిలుపుదల అని సుప్రీం ధర్మాసనం వివరించింది.అమరరాజా బ్యాటరీ పరిశ్రమ కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఏపీ పీసీబీ షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టేని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. కంపెనీ మూసివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement