Tuesday, May 14, 2024

రేపు టీఎస్ పాలీసెట్ రిజ‌ల్ట్స్‌.. వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవ‌చ్చ‌న్న అధికారులు

TS POLYCET పరీక్షను జూన్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించారు. ఈ పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌ను చూడాలని వేయిట్ చేస్తున్నారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తాజా వివరాల ప్రకారం, తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రిజ‌ల్ట్స్ ను రేపు (13 జులై) ఉదయం 11:30 గంటలకు ప్రకటించ‌నుంది.

అభ్యర్థులు తెలంగాణ పాలీసెట్ ఫలితాలను హాల్ టిక్కెట్ నంబర్‌, ఇతర వివరాల సహాయంతో అధికారిక వెబ్‌సైట్ www.polycetts.nic.in లో చెక్ చేసుకోవ‌చ్చు & డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. మెరిట్ జాబితా ఆధారంగా అధికారిక విభాగం కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement