Thursday, May 2, 2024

Cricket | వన్డే వరల్డ్​ కప్​ హంగామా షురూ.. అక్టోబర్ నుంచి ఆన్​లైన్​లో టికెట్లు!

క్రికెట్ అభిమానులు పండుగలా భావించే వన్డే వరల్డ్ కప్- 2023 టోర్నీ అక్టోబర్ 5వ తేదీన ప్రారంభం కానుంది. అయితే వరల్డ్ కప్ 2023 టికెట్ల అమ్మకాల బాధ్యతలను రెండు ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ లకు అప్పగించడానికి BCCI సిద్ధమైంది. వరల్డ్ కప్ 2023 టికెట్లను BookMyShow, Paytm యాప్ ల‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే స్టేడియాల్లోకి వెళ్లేముందు ఈ టికెట్‌ల ఫిజికల్ కాపీలను చూపించాల్సి ఉంటుంది.

అయితే.. వాంఖడే స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌ల టికెట్లు Paytm.comలో.. అలాగే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్, వరల్డ్ కప్ ఫైనల్ టికెట్లు Bookmyshow.comలో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఇక ఆగస్టు 10వ తేదీ నుంచి టికెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement