Sunday, April 28, 2024

JioBook | తక్కువ ధరలోనే ల్యాప్​టాప్​.. జియోబుక్​ లాంచ్​ చేసిన రిలయన్స్​

రిలయన్స్ రిటైల్ ఇవ్వాల (సోమవారం) దేశంలో స‌రికొత్త జియోబుక్ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. రూ.16,499 ధరకే ఈ ల్యాప్‌టాప్ మార్కెట్ లో అందుభాటులోకి రానుంది. ఈ ల్యాప్‌టాప్ ను అన్ని వయస్సుల వారికి ఉపయోగపడేలా డిజైన్ చేసింది కంపెనీ. జియోబుక్ స్టైలిష్ డిజైన్, అద్భుతమైన ఫీచర్స్‌తో వస్తుంది. మ్యాటే ఫినిషింగ్ అద్భుతంగా ఉంటుంది. జియోఓఎస్ తన యూజర్ల సౌకర్యం, సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ను త‌యారు చేసింది.

దీంతో జియోబుక్ ప్రతీ ఒక్కరికీ త‌మ‌ లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్‌‌ను మరింత మెరుగ్గా అందించబోతోంది. ఈ జియోబుక్ లో అధునాతన జియోఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, స్టైలిష్ డిజైన్, ఎల్లప్పుడూ కనెక్ట్ చేయబడిన ఫీచర్స్ ఉంటాయి. ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నా, కోడ్ నేర్చుకోవాలన్నా, యోగా స్టూడియోను ప్రారంభించాలన్నా, ఆన్‌లైన్ ట్రేడింగ్ చేయాలన్నా, ప్రతీ ఒక్కరి అవసరాల్ని ఈ జియోబుక్ తీరుస్తుంది.

హార్డ్‌వేర్ విషయానికి వస్తే 2.0GHz ఆక్టాకోర్ ప్రాసెసర్, 4GB LPDDR4 RAM, 64GB స్టోరేజ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఎస్‌డీ కార్డ్ సాయంతో 256జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇన్ఫినిటీ కీబోర్డ్, లార్జ్ మల్టీ జెశ్చర్ ట్రాక్‌ప్యాడ్, యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్ట్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

జియోబుక్ సాప్ట్ వేర్ ఫీచర్స్ ఇవే..

  • 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్-బ్యాండ్ వైఫై సామర్థ్యాలు: – దేశంలోని మారుమూల ప్రాంతాలలో కూడా నిరంతరాయంగా నేర్చుకోవడం కోసం అంతరాయం లేని ఇంటర్నెట్ యాక్సెస్ లభిస్తుంది.
  • సహజమైన ఇంటర్ఫేస్
  • 75+ కీబోర్డ్ షార్ట్‌కట్స్
  • ట్రాక్‌ప్యాడ్ జెశ్చర్స్
  • స్క్రీన్ ఎక్స్‌టెన్షన్
  • వైర్‌లెస్ ప్రింటింగ్
  • మల్టీ టాస్కింగ్ స్క్రీన్స్
  • ఇంటిగ్రేటెడ్ చాట్‌బాట్
  • జియో టీవీ యాప్ ద్వారా ఎడ్యుకేషనల్ కంటెంట్‌కి యాక్సెస్
  • జియోక్లౌడ్ గేమ్స్‌తో ప్రముఖ గేమింగ్ టైటిల్స్
  • JioBIAN ద్వారా కోడింగ్ యాక్సెస్. విద్యార్థులు C/C++, Java, Python, Pearl లాంటి వివిధ భాషలలో కోడ్ చేయడం సులభంగా నేర్చుకోవచ్చు.

జియోబుక్ హార్డ్‌వేర్ ఫీచర్స్…

  • అత్యాధునిక ఆపరేటింగ్ సిస్టమ్ – JioOS
  • అల్ట్రా స్లిమ్, సూపర్ లైట్ (990గ్రాములు), ఆధునిక డిజైన్
  • స్మూత్ మల్టీ టాస్కింగ్ కోసం శక్తివంతమైన ఆక్టా-కోర్ చిప్‌సెట్
  • 11.6 అంగుళాల (29.46CM) యాంటీ గ్లేర్ HD డిస్‌ప్లే
  • ఇన్ఫినిటీ కీబోర్డ్, లార్జ్ మల్టీ జెశ్చర్ ట్రాక్‌ప్యాడ్
  • USB, HDMI, ఆడియో పోర్ట్స్
  • ఇక ఈ ల్యాప్ టాప్ ఆగస్ట్ 5 నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌, అమెజాన్‌లో జియోబుక్ కొనొచ్చు.
Advertisement

తాజా వార్తలు

Advertisement