Tuesday, September 21, 2021

ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో వచ్చేసింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నారు. గతంలో ‘బిగ్‌బాస్’ షోతో అలరించిన ఆయన.. త్వరలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో వేదికగా అభిమానులను పలకరించనున్నారు. ఈనెల నుంచే ఈ షో జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేసే టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు.

ఈ టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది. క‌రోనా స‌మ‌యంలో పిల్లలు ఫీజులు కూడా క‌ట్ట‌లేని ప‌రిస్థితులు. ఓ ప్రైవేటు కాలేజీ లెక్చ‌ర‌ర్‌ని జాబ్ మానేయ‌మ‌ని చెబుతుంది. ఆ లెక్చ‌ర‌ర్ దోశ బండి పెట్టుకుంటాడు. అక్క‌డ కూడా త‌న స్టూడెంట్స్‌కు డ‌బ్బులు తీసుకోకుండా టిఫ‌న్స్ పెడుతుంటాడు. క‌ట్ చేస్తే.. అదే లెక్చ‌ర‌ర్ హాట్ సీట్‌లో తార‌క్ ఎదురుగా కూర్చుని పాతిక ల‌క్ష‌లు గెలుచుకుంటాడు. ఈ డ‌బ్బునేం చేస్తార‌ని స‌ద‌రు లెక్చ‌ర‌ర్‌ని తార‌క్ అడిగితే.. ఫీజులు క‌ట్ట‌లేని మా స్టూడెంట్స్‌కు ఇందులోని స‌గం డ‌బ్బుల‌తో ఫీజు క‌ట్టేస్తాన‌ని, మిగిలిన స‌గం డ‌బ్బులు వాడుకుంటాన‌ని చెప్ప‌డంతో తార‌క్ లెక్చ ర‌ర్‌ను అభినందిస్తాడు.

ఈ వార్త కూడా చదవండి: హైదరాబాద్‌లో మాస్కులు వేసుకుని రెచ్చిపోతున్న దొంగలు

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News