Monday, January 17, 2022

ట్రిపుల్ ఐటీ సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ట్రిపుల్‌ ఐటీ)ల్లో కౌన్సె లింగ్‌ అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి చాన్స్‌లర్‌ కేసీ రెడ్డి శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నాలుగు క్యాంపస్‌లలో వివిధ కేటగి రిలు, రీజియన్లలో ఉన్న సీట్ల వివరాలను ఆర్‌జీయూకేటీ వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ కోసం తమ పేర్లు నమోదు చేసుకోవాలని, వెబ్‌సైట్‌లో లింక్‌ ఆదివారం నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.ఇప్పటికే ఆయా క్యాంపస్‌లలో చేరిన విద్యార్థులు కూడా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 20 వరకు గడువు ఉందని తెలిపారు. షార్ట్‌ లిస్ట్‌ అయిన అభ్యర్థులను ఈ నెల 27 నూజివీడు క్యాంపస్‌ లో కౌన్సెలింగ్‌కు కాల్‌ లెటర్ల ద్వారా పిలుస్తా మని చాన్స్‌లర్‌ కేసీ రెడ్డి వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News