Thursday, May 2, 2024

బీ-కేటగిరీ సీట్లకు నోటిఫికేషన్‌ విడుదల.. ప్రైవేట్‌ కాలేజీల్లోని ఇంజనీరింగ్‌, ఫార్మసీ 30 శాతం సీట్ల భర్తీకి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా (బీ-కేటగిరీ) సీట్ల భర్తీకి తెలంగాణ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం 2022-23కిగానూ 30 శాతం మేనేజ్‌మెంట్‌ సీట్లను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీఈ/బీటెక్‌, బీఫార్మసీ, ఫార్మ్‌-డి కోర్సులకు సంబంధించి మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ సీట్లను భర్తీ చేసేందుకు అక్టోబర్‌ 25వ తేదీలోగా నోటిఫికేషన్‌ జారీ చేసి భర్తీ చేయాలని సూచించింది. అయితే కాలేజీలు పారదర్శకంగా సీట్ల కేటాయింపు చేపట్టాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఉన్నత విద్యామండలి హెచ్చరించింది.

నోటిఫికేషన్‌కు సబంధించి తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ పేపర్లలో ప్రకటన ఇవ్వాలని, రోజూవారి దరఖాస్తుల వివరాలను పొందుపర్చాలని సూచించింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకోవాలని, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద కూడా సీట్లను కేటాయించాలని పేర్కొంది. ఎంసెట్‌, జేఈఈలో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా సీట్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement