Friday, May 17, 2024

కడెం ప్రాజెక్టు రెండు వరద గేట్లు ఎత్తివేత

ప్రభన్యూస్‌: నిర్మల్‌ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ఇన్ ఫ్లో వరద నీరు జలాశయంలో వచ్చి చేరుతుండడంతో కడం ప్రాజెక్ట్‌ నీటిమట్టం పెరుగుతుంది కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఏడు అడుగులు కాగా రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాల మూలంగా జలాశయంలో పదివేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వరద నీరు వచ్చి చేరడంతో మంగళవారం నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుకు చెందిన రెండు వరద గేట్లు ఎత్తివేసి 12 వేల,800 వందలక్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు మంగళవారం సాయంత్రం ఇన్‌ఫ్లో వరద నీరు కొద్ది మేర తగ్గుముఖం పట్టడంతో ఎత్తిన రెండు వరద గేట్లలో ఒక వరద గేటును మూసివేసి మరొక వరద గేటు నుండి గోదావరిలోకి నీటి సరఫరా కొనసాగిస్తున్నారు ప్రస్తుతం కడెం ప్రాజెక్టు నీటిమట్టం 698 .200 అడుగులకు ఉండగా జలాశయంలో 5 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement