Friday, April 26, 2024

అమెజాన్‌లో 100 కాదు 20 వేల మంది అవుట్‌.. భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న సంస్థ

ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిం ది. 10 వేల మంది ఉద్యోగులకు తొలగించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంఖ్య 20 వేలకు పైగానే ఉంటుందని తాజాగా వెల్లడించింది. కరోనా సమయంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్న అమెజాన్‌ ఇప్పుడు అంతే స్థాయిలో తొలగింపులు ప్రారంభించింది. ఖర్చులు తగ్గించుకోవాలన్న పేరుతో సంస్థలోని అన్ని విభాగాల్లోనూ పని చేస్తున్న అన్ని రకాల ఉద్యోగులపై వేటు వేస్తోంది. అమెజాన్‌లో గ్రేడ్‌ 1 నుంచి 7 వరకు పని చేస్తున్న అన్ని ర్యాంకింగ్‌ ఉద్యోగులు తొలగించే వారి జాబితాలో ఉన్నారని కంప్యూటర్‌ వరల్డ్‌ సంస్థ పేర్కొంది. నవంబర్‌లో న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రకారం అమెజాన్‌ 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

కొన్ని రోజులుగా ఉద్యోగుల పనితీరుపై నివేదికలు ఇవ్వాలని కంపెనీ మేనేజర్లను పదేపదే కోరుతోంది. అమెజాన్‌లో ప్రపంచ వ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో తాజాగా తొలగించాలని నిర్ణయించిన 20 వేల మంది ఉద్యోగులు 1.3 శాతంతో సమానం. తొలగించే వారిలో తాత్కాలిక ఉద్యోగులు కూడా ఉన్నారు. తొలగించాలనుకున్న ఉద్యోగులకు అమెజాన్‌ 24 గంటల ముందు నోటీస్‌ ఇస్తోంది. ఇది కంపెనీ చరిత్రలోనే అతి పెద్ద లేఆఫ్‌. నవంబర్‌ 17న కంపెనీ సీఈఓ జాస్సీ ఉద్యోగులకు రాసిన లేఖలో లేఆఫ్‌లను ధృవీకరించారు. ఈ సంవత్సరం చాలా క్లిష్టమైనదని ఆయన పేర్కొన్నారు. తొలగింపుకు గురవుతున్న

- Advertisement -

ఉద్యోగులకు కంపెనీ నేరుగా సమాచారం ఇస్తుందని కూడా జాస్సీ తన లేఖలో పేర్కొన్నారు. కంపెనీ నుంచి తొలగింపుకు గురైన ఉద్యోగులకు సానుభూతిగా ఉంటామని, వారు కొత్త ఉద్యోగాల్లో చేరేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామి ఇచ్చారు. తొలగింపుకు గురై ఉద్యోగులకు అదనపు చెల్లింపులతో పాటు, కొంత కాలం మెడికల్‌ ఇన్సూరెన్స్‌ను కొనసాగిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement