Sunday, April 28, 2024

సాధార‌ణ ‘ప్ర‌స‌వాల’ కోసం మిడ్ వైఫ‌రీ శిక్ష‌ణ‌..అంటే ఏంటో తెలుసా..

ఇప్పుట్టి సంగ‌తి ప‌క్క‌న‌పెడితే ఒక‌ప్పుడు ప్రెగ్నెన్సీ, డెలీవ‌రీలు ఇవ‌న్నీ కొంచెం క‌ష్టంతో కూడుకునేవి. ప్ర‌స‌వించే స‌మ‌యంలో మ‌ర‌ణాలు సంభ‌వించేవి. ప్ర‌స‌వ వేద‌న న‌ర‌కంగా ఉండేది. అయినా బిడ్డ పుట్టాక ఆ క‌ష్టాన్నే మ‌ర‌చిపోయేవారు త‌ల్లులు. అయితే నేటి ఆధునిక కాలంలో డెలివ‌రీలు నొప్పులు ప‌డ‌కుండానే జ‌రిగిపోతున్నాయి. సిజేరియ‌న్ పేరిట సులువుగా ప్ర‌స‌వాలు జ‌రిపోతుండ‌టం త‌ల్లుల‌కి ఎంతో ఈజీ అయిపోయింది. ప్ర‌స‌వ వేద‌న ప‌డ‌కుండానే బిడ్డ‌ల‌కి త‌ల్లులుగా మారుతున్నారు నేటి మ‌హిళ‌లు. నేడు సిజేరియ‌న్ అనేది కామ‌న్ గా మారిపోయింది. అందుకే సాధారణ కాన్పులపై అవగాహనే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని స్టాఫ్ నర్సులకు ‘మిడ్ వైఫరీ’ శిక్షణ ఇస్తోంది ప్రభుత్వం. ఈ శిక్షణలో భాగంగా నార్మల్ డెలివరీ కోసం గర్భిణి స్త్రీలతో వ్యాయామం చెప్పిస్తున్నారు నర్సులు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే అమల్లో ఉండే ఈ విధనాన్ని ప్రస్తుతం తెలంగాణ రాష్టంలో అమలుకు చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా ఫైలెట్ ప్రాజెక్ట్ కింద ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్, సంగారెడ్డి ఆస్పత్రులు ఎంపీక చేశారు. పురిటి నొప్పులతో పునర్జన్మ ఇవ్వడానికి, మరో ప్రాణిని ఈ లోకంలోకి చేరవేసే మాతృమూర్తికి ప్రసవ వేదన బాధగా వుండొద్దని, వారికి సాధారణ ప్రసవాలు మాత్రమే కలగాలని వినూత్న తరహాలో ప్రసవాలు చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. సంగరెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రితో పాటు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సాధారణ ప్రసవాలకు నడుం బిగించారు. ఆడవారికి అమ్మతనం దేవుడిచ్చిన గొప్పవరం. ప్రపంచంలో ఒక ప్రాణిని సృష్టించాలి అంటే కేవలం ఇద్దరికి సాధ్యం. ఒకటి దైవం, రెండు అమ్మ. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడంతో పాటు తాను కూడా పునర్జన్మ పొందుతుంది. అటువంటి గర్భస్థ సమయంలో ప్రసవ సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సాధారణ ప్రసవం అయ్యేందుకు వారిచే చిన్న, చిన్న వ్యాయామాలు (మిడ్ వైఫరీ శిక్షణ..)చేయిస్తూ వారికి సిజేరియన్ కాకుండా సాధారణ ప్రసవాలు కలిగే విధంగా ప్రోత్సహిస్తున్నారు ఆయా ఆసుపత్రుల సిబ్బంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement