Wednesday, October 27, 2021

బద్వేల్ ఉపఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు

ఏపీలోని కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. అయితే ఇవాళ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఉప ఎన్నికల బరిలో మొత్తంగా 15 మంది అభ్యర్థులు మిగిలారు. నోటిఫికేషన్ నుంచి నామినేషన్ గడువు ముగిసేలోపు మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. అందులో పరిశీలనలో 9 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.. మిగతా వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఫైనల్‌గా 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News