Thursday, April 25, 2024

నాగార్జున సాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు 32232 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తు న్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310. 84 98 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది.

రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9245 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8541 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29354 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా వరద కాల్వ ద్వారా నీటి విడుదల లేదు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 81772 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా, అదే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 884.80 అడుగులు ( 214.3637 టీఎంసీలు) ఉంది. శ్రీశైలంకు 121080 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement