Tuesday, May 7, 2024

ఈ ఏడాదీ నిరాడంబరంగా రాములోరి కల్యాణం!

కరోనా వైరస్ విజృంభిస్తున్న‌ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈసారి శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌లను నిరాండంబ‌రంగా నిర్వ‌హించ‌నున్నాయి. తెలంగాణలోని భద్రాద్రి పుణ్యక్షేత్రం, ఆంధ్రప్రదేశ్ లో ఒంటిమిట్ట దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి. కానీ కరోనా కారణంగా గత ఏడాది నిరాడంబరంగా నిర్వహించారు. కనీసం ఈసారైనా రాములోరి కల్యాణాన్ని కళ్లారా వీక్షించాలని భక్తులు అనుకున్నారు. కానీ మార్చిలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో వమి వేడుకల్ని నిరాడంబరంగా నిర్వహించబోతున్నారు.  

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హోలీ, ఉగాది, శ్రీరామనవమితో పాటు అన్ని పండుగలపైనా ఆంక్షలను విధించింది. ఈ క్రమంలో భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలపైనా దేవాదాయశాఖ క్లారిటీ ఇచ్చింది. గత ఏడాది లాగే ఈసారి కూడా సీతారాముల కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భద్రాద్రి రాములోరి కల్యాణాన్ని ఈసారి కూడా నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పరిమిత సంఖ్యలో భక్తులతో మాత్రమే వేడుకలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భక్తులెవరూ భద్రాచలం రావొద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రోనా నేపథ్యంలో భద్రాలచం ఆలయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. కోవిడ్ నిబంధనలను అనుగుణంగా భక్తులకు దర్శనాలు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు శుక్రవారం(ఏప్రిల్ 16) ప్రకటించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండటంతో..కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్న దేవాలయాలన్నిటినీ మూసివేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో ఒంటిమిట్ట ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

కాగా, గతేడాది కంటే ఈసారి కరోనా రెట్టించిన వేగంతో విజృంభిస్తోంది. కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కూడా నవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇప్పటికే అనేక దేవాలయాలను కరోనా కారణంగా మూసివేశారు. అయితే, నిత్యకైంకర్యాలను యథావిధిగా నిర్వహిస్తున్నారు.  భక్తుల ప్రవేశానికి అనుమతి ఇవ్వడం లేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement