Thursday, May 2, 2024

Union Budget 2024: ఎలాంటి ప్రయోజనం లేదు..బ‌డ్జెట్‌పై కాంగ్రెస్ విమ‌ర్శ‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలలా సీతారామన్‌ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను (Union Budget 2024) కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. సామాన్యులకు ఎలాంటి ఉపశమనం కలిగించలేదని, రైతులకు, యువకులకు ఎలాంటి ప్రయోజనం లేదంటూ మండిప‌డ్డారు.

ద్రవ్యలోటు పెరుగుదలపై కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి సమర్పించిన సంఖ్యలు ఈ సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో 18 లక్షల కోట్లకు పైగా నిధులు ఇవ్వని వాటిగా చూపిస్తున్నాయి. ఈ సంఖ్య మరింత పెరుగనున్నది’ అని అన్నారు.

కాగా, సాధారణంగా ప్రతి కార్యక్రమంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశంసించే రాజకీయ ప్రకటన మాదిరిగా మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగం ఉందని రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు సచిన్ పైలట్ విమర్శించారు. న్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సాధారణ ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించడానికి అవసరమైన నిధులు ఉండేలా చూసుకోవడానికి కేవలం పరిపాలనాపరమైన కసరత్తు మాత్రమే మధ్యంతర బడ్జెట్‌ అని కాంగ్రెస్ఎం పీ కార్తీ చిదంబరం అన్నారు. అంతకు మించి ఇందులో కొత్త ఏమీ లేదని పెదవి విరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement