Sunday, April 28, 2024

మోడీపై అవిశ్వాస తీర్మానం – 8వ తేది నుంచి మూడు రోజ‌లు చ‌ర్చ‌..

న్యూఢిల్లీ: విప‌క్షాలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం పై ఈ నెల ఎనిమిదో తేదిన‌ పార్ల‌మెంట్‌లో చ‌ర్చ జ‌ర‌నున్న‌ది. మ‌ణిపూర్ అంశంపై ప్ర‌ధాని మోడీ ఉభ‌య‌స‌భ‌ల్లో ప్ర‌క‌ట‌న చేయ‌డం లేద‌ని, అందుకే కేంద్ర స‌ర్కార్‌పై అవిశ్వాసాన్ని ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు విప‌క్షాలు పేర్కొన్న విష‌యం తెలిసిందే. లోక్‌స‌భ‌లో ఎంపీ గౌర‌వ్‌ గ‌గోయ్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని స్పీక‌ర్ బిర్లా ఆమోదించారు. అయితే ఈ అంశంపై లోక్‌స‌భ‌లో 8వ తేదీ నుంచి మూడు రోజ‌లు చ‌ర్చ‌జ‌ర‌గ‌నుంది. ఆ చ‌ర్చ‌కు 10వ తేదీన ప్ర‌ధాని మోడీ స‌మాధానం ఇవ్వ‌నున్నారు..

కాగా, అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్ నోటీసుపై 50 మంది స‌భ్యులు సంత‌కం చేశారు. లోక్‌స‌భ‌లో 543 మంది స‌భ్యులు ఉన్నారు. ప్ర‌స్తుతం ఎన్డీఏ బ‌లం 331. విప‌క్ష కూట‌మి ఇండియా బ‌లం 144 మంది. అయితే ఈ తీర్మానాన్ని విప‌క్షం నెగ్గ‌డం కుద‌ర‌దు. కానీ మ‌ణిపూర్ అంశంపై ప్ర‌ధాని మోడీ మాట్లాడే విధంగా చేస్తుంద‌ని విప‌క్షాలు భావిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement