Friday, April 26, 2024

Gold Rate: రూ.600 తగ్గిన వెండి ధర.. బంగారం రేట్ ఎంతంటే..

బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా మంగళవారం భారీగా తగ్గిన బంగారం ధరలు.. బుధవారం మాత్రం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,510 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక, బంగారం ధరలు స్థిరంగా కొనసాగితే.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. వెండి ధర ఎకంగా రూ.600 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.67 వేలుగా నమోదైంది. ఏపీలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement