Wednesday, May 1, 2024

కరీంనగర్ లో భారీ వర్షం.. రైతులకు అపార నష్టం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున వర్షం దంచి కొట్టింది. జగిత్యాల జిల్లాలో మామిడి నెల రాలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ఈ వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షానికి వరి ధాన్యం తడవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement