Sunday, April 28, 2024

ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నిఖిల్ SPY రిలీజ్ డేట్.. జూన్ 20న ట్రైలర్ రానుంది

యంగ్ హీరో నిఖిల్ త‌న అప్ క‌మింగ్ పాన్ ఇండియన్ మూవీ SPY. ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి ప్రేక్షకులలో కొంత గందరగోళం ఉంది, అయితే షెడ్యూల్ ప్రకారమే జూన్ 29 న ఈ సినిమా విడుదలవుతుందని మేకర్స్ ధృవీకరించారు. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

గ్యారీ BH దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్-ప్యాక్డ్ SPY థ్రిల్లర్. ఈ మూవీ కథనం.. హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను అందిస్తుందని, ఇవి వీక్షకులను మరింత కోరుకునేలా చేస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఇది క్యూరియాసిటీని రేకెత్తిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement