Sunday, May 12, 2024

West Bengal: మరో ఆరు నెలల్లో కొత్త తృణమూల్​ పార్టీ.. బెంగాల్​లో పోస్టర్ల కలకలం!

పశ్చమబెంగాల్​లో కమ్యూనిస్టులను నిలదొక్కుకుండా చేసి ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న తృణమూల్​ అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఆ పార్టీలోనే ఓవర్గం తయారవుతోందా? అన్న ప్రశ్నలు అందరిలోనూ వస్తున్నాయి. ఎందుకంటే తృణమూల్​ కోటగా భావించే హజ్రాలో వెలసిన పోస్టర్లే దీనికి కారణమంటున్నారు చాలామంది పరిశీలకులు. ఆశ్చర్యమేమిటంటే.. ఈ పోస్టర్లలో మమతా బెనర్జీ లేకపోవడమే కాకుండా కొత్తగా మరో ఆరు నెలల్లో కొత్త తృణమూల్​ పార్టీని చూస్తారనే సందేశం ఉంది. వాల్​ పోస్టర్లలో టీఎంసీ లోగోతోపాటు అభిషేక్​ బెనర్జీ ఫొటో ఉండడం గమనార్హం. ప్రజలు కోరుకున్నట్టే మరో ఆరు నెలల్లో కొత్త టీఎంసీ వస్తుంది అని ఆ పోస్టర్లలో రాశారు.

ఈ ఏరియా మమతా బెనర్జీ నివాసం ఉండే ఏరియా కావడం కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం అంటున్నారు పరిశీలకులు. ఈ పోస్టర్లను చూసిన వారంతా ‘‘6 నెలల్లో కొత్త టీఎంసీ”అంటే ఏమిటనే ప్రశ్నలు వేస్తున్నారు. దీనికి తోడు తృణమూల్ కాంగ్రెస్‌లో అంతా బాగానే ఉందా అనేది కూడా ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ పోస్టర్లపై రాజ్యసభ ఎంపీ డాక్టర్ శంతను సేన్ స్పందించారు. TMCలో అసంతృప్తులు ఉన్నాయనే వాదనను ఆయన  ఖండించారు.

పార్టీలో అంతర్గతంగా ఎలాంటి విభేదాలు లేవని, ఫ్యాక్షనిజం వంటివి ఉండడానికి ఇది బీజేపీ కాదన్నారు శంతను సేన్​. మమతా బెనర్జీ తమ నాయకురాలని అభిషేక్ బెనర్జీ కూడా స్వయంగా ఈ విషయాన్ని అన్ని సందర్భాల్లోనూ చెప్పారన్నారు. ఇది పార్టీ కానీ  పార్టీ నాయకులు కానీ చేసిన పనికాకపోవచ్చని శాంతను సేన్ అన్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement