Wednesday, May 8, 2024

న్యూలుక్‌లో బుట్ట‌బొమ్మ‌.. బ‌ర్త్ డే విషేష్ చెప్పిన రాధేశ్యామ్ టీమ్‌

ప్ర‌భన్యూస్‌, హైద‌రాబాద్‌: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా జంటగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’. తాజాగా ఈ సినిమా నుంచి పూజా హెగ్డే కొత్త పోస్టర్ రిలీజైంది. రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ – ప్రమోద్ – ప్రశీద కలిసి భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వ‌స్తున్న‌ ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రభాస్, పూజా హెగ్డేల పోస్టర్స్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమా మీద బాగా అంచనాలను పెంచాయి. ఈ క్రమంలో బుధ‌వారం (అక్టోబర్ 13) హీరోయిన్ పూజా బర్త్ డే సందర్భంగా, ఇందులో ప్రేరణగా నటిస్తున్న ఆమె లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement