Sunday, May 26, 2024

లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌ కస్టమర్లకు.. కొత్త ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌లు

హైదరాబాద్‌: లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ కస్టమర్లకు రేపటి నుంచి కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. లక్ష్మీ బ్యాంక్‌ 2020 నవంబర్‌లో డీబీఎస్‌లో విలీనం అయింది. కానీ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ నేటివరకూ చెల్లుబాటులో ఉన్నాయి. అయితే రేపటి నుంచి ఇక పాత ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు పనిచేయవు. వీటిస్థానంలో మార్చి 1నుంచి కొత్తకోడ్‌లు అమల్లోకి రానున్నాయి. ఇకనుంచి డీబీఎస్‌ బ్యాంక్‌ కొత్త ఐఎష్‌ఎస్‌సీ కోడ్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. మార్చి 1నుంచి నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌, ఆర్‌టీజీఎస్‌ విధానాల్లో నగదును పంపాలంటే కచ్చితంగా కొత్త డీబీఎస్‌ ఐఎష్‌ఎస్‌సీ కోడ్స్‌నే వాడాల్సి ఉంటుంది. డీబీఎస్‌ బ్యాంక్‌ ఇప్పటికే కస్టమర్లుకు ఈ విషయాన్ని ఈ-మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఖాతాదారులకు తెలిపింది.

కాగా కేవలం నగదు ట్రాన్స్‌ఫర్‌ మాత్రమే కాకుండా పాత చెక్‌బుక్స్‌ను కలిగి ఉంటే వాటిని కూడా మార్చుకోవాలి. ఎంఐసీఆర్‌ కోడ్‌ మారనుండటంతో పాత చెక్‌బుక్స్‌ చెల్లుబాటుకావు. పాత చెక్‌బుక్స్‌కు బదులు బ్యాంక్‌ నుంచి కొత్త చెక్‌బుక్స్‌ పొందాల్సి ఉంటుంది. లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెక్‌బుక్‌ కోసం అప్లయ్‌చేసుకోవచ్చు. కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్‌ను ఇన్‌కంట్యాక్స్‌, ఇన్స్యూరెన్స్‌, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌, నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌, డీమ్యాచ్‌ అకౌంట్‌లలో అప్‌డేట్‌ చేసుకోవాలి. కాగా కేంద్రం ఇప్పటికే పలు బ్యాంకులను విలీనం చేసిన సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement