Monday, May 6, 2024

ట్రైలర్ టాక్ : ఆస‌క్తిక‌రంగా సెబాస్టియ‌న్ ట్రైల‌ర్..

కిరణ్‌ అబ్బవరం హీరోగా, బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్నా తాజా చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి 524’. లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో సిద్ధారెడ్డి బి, జయచంద్రా రెడ్డి, రాజు, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. కోమలీ ప్రసాద్, నువేక్ష హీరోయిన్లుగా నటిస్తున్న. కాగా.. ఈ మూవీ మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది మూవీ యూనిట్‌.

ఈ నేపథ్యంలో ఈ రోజు(ఫిబ్రవరి 28) హీరో విజయ్‌ దేవరకొండ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్‌. ఆర్థిక సమస్యలు, కష్టాలతో పెరిగిన హీరో పోలీసు ఆఫీసర్‌ ఎలా అయ్యాడు. రే చీక‌టితో బాద ప‌డే అత‌ని స‌మ‌స్య‌తో మంచి హాస్యాన్ని పండించాడు హీరో.. ఈ ‍ క్రమంలో ఓ మర్డర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్‌ అవుతాడు. రే చికటితో బాధపడే అతడు కేసును ఎలా చేదిస్తాడు వంటి ఆసక్తికర అంశాల‌తో మలిచిన ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ అవుతుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement