Tuesday, April 30, 2024

నెట్ ప్లిక్స్ లో.. మట్టీ కుస్తీ చిత్రం

మట్టీ కుస్తీ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. కాగా న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 నుండి ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. విష్ణు విశాల్ హీరోగా నటించగా..ఆయనకి జోడీగా ఐశ్వర్య లక్ష్మీ నటించింది. వీరిద్ధరూ ఈ సినిమాలో భార్య, భర్తలుగా నటించారు. భార్య భర్తల మధ్య చోటు చేసుకునే చిన్నచిన్న తగాదాలకు కుస్తీ పోటీ నేపథ్యాన్ని ఎంచుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.

విష్ణు విశాల్ స్టూడీయోస్, ఆర్ టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించాడు.విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి చల్లా అయ్యవు దర్శకత్వం వహించాడు. విష్ణు విశాల్ తో కలిసి రవితేజ ఈ సినిమాను నిర్మించారు. ఇక రవితేజ ఈ సినిమాలో భాగం కావడంతో తెలుగులోనూ మంచి బజ్ ఏర్పడింది. కాగా భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న రిలీజైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement