Saturday, May 4, 2024

ఆసక్తిరేపుతోన్న బెల్లంకొండ గణేశ్.. మూవీ టీజర్

బెల్లంకొండ గణేశ్ నటిస్తోన్న తాజా చిత్రం నేను స్టూడెంట్ సార్. రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది.సస్పెన్స్‌ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాంది ఫేమ్ సతీష్‌ వర్మ నిర్మించాడు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజైంది. గణేష్‌కు జోడీగా అవంతిక హీరోయిన్‌గా నటిస్తుంది. సముద్రఖని కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ బాణీలు సమకూరుస్తున్నాడు. హీరో కష్టపడి ఐఫోన్‌ కొనుక్కుంటాడు. అయితే ఈ ఫోన్‌ను పోలీసులు కొట్టేస్తారు. దాంతో హీరో కమిషనర్‌కు కంప్లైంట్‌ ఇవ్వడానికి కమిషనర్‌ ఆఫీస్‌కు వెళ్తాడు. అయితే అప్పుడు హీరోను ఎవరో కావాలని ట్రప్‌ చేసినట్లు హీరోకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది అనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. అసలు హీరోను ఎవరు ట్రాప్‌లో పడేశారు. ఆ ఫోన్‌లో ఏముంది అనేది సినిమా రిలీజయ్యాక తెలుస్తుంది. టీజర్‌తోనే మేకర్స్‌ సినిమాపై తీవ్ర ఆసక్తిని పెంచారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement