Thursday, April 25, 2024

Telangana: శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఆటంకాల్లేవ్​.. నల్లమలలో రాత్రివేళ కూడా జర్నీ చేయొచ్చు

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రాత్రివేళ కూడా ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) తెలిపింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులు ఇకపై ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆలయానికి చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు మల్లన్నను దర్శించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్ఉట తెలుస్తోంది. దీనికి సంబంధించి టీఎస్‌ఆర్‌టీసీ రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ శ్రీధర్‌ ఇటీవల అటవీశాఖాధికారులతో చర్చించారు.

మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్) నుండి వచ్చే ఆర్‌టీసీ బస్సులు నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం వద్ద ఉన్న మున్ననూరు, దోమలపెంట చెక్‌పోస్టులలో రాత్రిపూట కూడా ఆగకుండా ప్రయాణించేలా చూడాలని మేనేజర్ కోరారు.

అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పిసిసిఎఫ్) రాకేష్ మోహన్ డోబ్రియాల్ భక్తుల ప్రయోజనం కోసం నవంబర్ 20 వరకు టీఎస్‌ఆర్‌టీసీ బస్సులను రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా గుండా వెళ్లడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం ఆలయానికి ఉదయం 3:45 నుండి 11:45 గంటల మధ్య టీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement