Tuesday, April 30, 2024

Nellore : మహా కుంభాభిషేకం మహోత్సవాలు ప్రారంభించిన మంత్రి కాకాణి

ముత్తుకూరు, జూన్ 12(ప్రభ న్యూస్) : రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో కృష్ణపట్నం గ్రామంలో పునరుద్ధరణ చేయబడిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి సీతా లక్ష్మణ హనుమత్ సమేత కోదండ రామస్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవ ధ్వ‌జ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం మంత్రి ఈ ఆలయానికి ఇచ్చేసి వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు. పూర్ణాహుతి, కలశసస్ధాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ మహా కుంభాభిషేక పూజా కార్యక్రమంలో 13.5 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఆలయ పునరుద్ధరణ పనులను భక్తులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వెయ్యి సంవత్సరాలు కాలంనాటి ప్రాచీన ఆలయాన్ని రాతి కట్టడంతో నిర్మించడం చాలా సంతోషకరమైన అంశం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఆలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోవూరు జనార్దన్ రెడ్డి, ఆలయ పాలకమండలి చైర్మన్ పెద్దపాళెం సుబ్బయ్య , ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement