Wednesday, May 15, 2024

నిష్కల్మష భక్తురాలు శబరి!

రామాయణంలోని కొన్ని చిన్న పాత్రలు ఆనాటి సామాజిక విలువల్ని సూచి స్తుంటాయి. అలాంటి పాత్రలకు ఒక ఉదాహరణ శబరి. ఆమె గిరిజన జాతికి చెందిన స్త్రీ. గురువులు చెప్పిన మాటపై శ్రద్ధవల్ల మోక్షాన్ని పొందుతుంది. రామాయణంలో అపూర్వం శబరి. భక్తికి కావాల్సింది నిర్మల హృదయం. సత్కర్మలు ఆచరిస్తూ, పవిత్ర మనసుతో భగవానుడిని ఆరాధించిన భక్తులు పుణ్యలోకాలు పొందుతారని నిరూపిస్తుంది రామాయణంలోని శబరి గాథ. నిరంతరం భగవన్నామ స్మరణతో తరించింది. వేద వేదాంగాల జ్ఞానాన్ని సంపాదించింది. అష్టాంగ యోగాలు, ఆసనాల సాధనతో తపస్వి నిగా పేరుగాంచింది శబరి.
శబరి ఒక గిరిజన మహళ. ఆమె మాతంగ మునిని గురువుగా భావించుకొని సేవ చేసుకుంటూ ఆశ్రమంలో ఉండేది. మునులు చెప్పిన విషయాలను నేర్చుకుంటూ భక్తిభావంలో జీవిస్తూవుంది. ఈమెను ‘శ్రమణీం ధర్మనిపుణాం’ అని వర్ణిస్తాడు వాల్మీకి. ‘శ్రమణి’ అంటే సన్యాస జీవితంలో ఉన్న స్త్రీ. ధర్మం విషయంలో కూడా ఆమెకు సంపూ ర్ణమైన అవగాహన ఉంది. శబరి చిన్నప్పటి నుండి పంపానది సమీపంలో ఉండే మాతంగ ముని ఆశ్రమంలోనే ఉండేది. ఆ ఆశ్రమం తప్ప ఆమెకు మరో లోకం తెలియ దు. శ్రీరాముడి గురించి ఆశ్రమంలో మాట్లాడుకుంటుంటే విని, రాముని గొప్పతనం గురించి తెలుసుకుంది. అతనిపై భక్తిని పెంచుకుంది. ఆ భక్తి రానురాను ఆమెలో పెరిగి పోయింది. ఎప్పటికైనా శ్రీరామచంద్రుని చూసి తరించాలని తపన పడుతూ వుంది.
రాముడు అరణ్యవాసానికి వచ్చిన విషయం మాతంగ ముని శిష్యులు శబరికి చెబుతారు. అప్పటినుండి శబరి రాముడి రాక కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతోం ది. జీవితంలో ఒక్కసారి రాముణ్ణి చూసి చనిపోతే చాలు జన్మ ధన్యమవుతుందని అను కుంది శబరి. మాతంగ ముని ఆశ్రమంలో గురువులు తమ జన్మ సార్థకత పొంది స్వర్గాని కి వెళ్లడానికి సిద్ధమయ్యారు. వారిని తీసుకెళ్లడానికి దివ్య విమానం వచ్చింది. మును లందరూ దాన్ని అధిరోహంచారు. ఆశ్రమంలో ఉన్న శబరితో మాతంగ ముని ”విష్ణు మూర్తి రామచంద్రుడిగా లక్ష్మణ సమేతుడై ఆశ్రమానికి రానున్నాడు, ఆ పురుషోత్తము డికి ఆతిథ్యం ఇచ్చి జన్మ చరితార్థం చేసుకో!” అని పలికి మిగతా మునులతో కలిసి స్వర్గాని కి వెళ్లిపోయాడు. శబరి ఆశ్రమంలోనే ఉండిపోయింది.
ఈ భక్తురాలి పుట్టుక వెనుక పలు కథలున్నాయి. కంబ రామాయణాన్ని అనుస రించి శబరి అంతకుముందు జన్మలో గంధర్వ రాజైన చిత్రకవకుని బిడ్డగా పుట్టింది. ఆమె పేరు మాలిని. ఆమె వివాహం వీతిహోత్రునితో జరుగుతుంది. ఆయన నిరంతరం జప, యజ్ఞ, హోమాలతో కాలం గడిపేవాడు. భర్తకు తగ్గట్టుగా మాలిని ఆదర్శ గృహణి గా ఉండేది. అయితే, ఒకానొక సందర్భంలో మాలినిని అనుమానిస్తాడు వీతిహోత్రుడు. శబర కన్యగా జన్మించమని శపిస్తాడు. మాలిని తన నిష్కల్మష హృదయాన్ని నిరూపించ గా, త్రేతాయుగంలో రామ దర్శనంతో శాప విమోచనం అవుతుం దని చెబుతాడు.
ఎప్పటికైనా రాముడు వస్తాడు అక్కడే ఉండమని గురువు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ రోజూ రామనామ జపం చేస్తూ రాముడి కోసం వేచి చూసింది. వయస్సు పైబడిపోయింది. ఒంట్లో సత్తువ తగ్గింది. అయినా రామనామాన్ని ఆమె ఆపలేదు. రాముడు వస్తాడని ప్రతిరోజు వేకువఝామునే లేచి ఆశ్రమ పరిసరాలను శుభ్రం చేసేది. అలికి ముగ్గులతో అలంకరించేది. నదిలో స్నానం చేసి రాముని పాదాలు కడగడానికి కడ వతో నీళ్ళు తెచ్చేది. పాదపూజ కోసం పూలు, రాముడు ఆరగించడానికి పళ్లూ తెచ్చేది. ఇలా ప్రతిరోజు చేస్తూనే ఉండేది. ఇలా సంవత్సరాల తరబడి విసుగూ విరామం లేకుండా శబరి రాముడి కోసం దాదాపు పదమూడేళ్లపాటు ఎదురుచూస్తుంది.
కబందుడి నోట శబరి భక్తి గొప్పదనాన్ని విన్న రాముడు మాతంగ ముని ఆశ్రమా నికి వెళ్తాడు. రాఘవుడి దర్శనం కోసం ఆరాటంతో ఉన్న శబరికి గొప్ప ఊరట కలిగింది. దాశరథిని ఆప్యాయంగా చూస్తూ తన్మయురాలైంది. ‘నా విష్ణు: పృథ్వీపతి:’ అంటూ సాదరంగా స్వాగతించింది. శ్రీరాముడి పాదాలు కడిగి, కూర్చోవడానికి ఆసనం చూపిం ది. అర్ఘ్య పాద్య ఆచమనీయాలనిచ్చి అతిథి సత్కారం చేసింది. తనకు అతిథి సేవలు చేసి న ఆ తపస్వినిని కుశల ప్రశ్నలతో పలకరించాడు శ్రీరామచంద్రుడు.
కశ్చిత్తే నిర్జితా విఘ్నా: కశ్చిత్తే వర్ధ తే తప:
కశ్చిత్తే నియత: కోప ఆహరశ్చ తపోధనే!! (అ. 74 – 8)
కశ్చిత్తే నియమా: ప్రాప్తా: కశ్చిత్తే మనస: సుఖమ్‌
కశ్చిత్తే గురు శుశ్రూషా సఫలా చారు భాషిణీ!! (అ.74 – 9)
”ఓ తపోధనురాలా! విఘ్నాలు లేకుండా తపస్సు కొనసాగుతోందా? కోపం, అహంకారం అదుపు ఉంటున్నాయా? ఓ చారు భాషిణీ! నియమ వ్రతాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయా? మనశ్శాంతి లభిస్తోందా? గురుసేవా ఫలాన్ని పొందగలిగావా?” అని పరామర్శించాడు శ్రీరామచంద్రుడు.
సిద్ధ³ురాలు, సిద్ధ సమ్మత అయిన ఆ తాపసి శ్రీరామునితో ”ఓ పురుషర్షభ! నీ సంద ర్శనం వల్లనే నా తప: ఫలం, గురు శుశ్రూషా ఫలం కూడ దక్కాయని, నీ అనుజ్ఞ అయితే గురు దేవుని మార్గంలోనే అక్షయమైన లోకానికి వెళ్లగలనని కోరింది. నీవు చిత్రకూ టానికి వచ్చినప్పటి నుంచి నీ రాకకు ఎదురుచూస్తూనే ఈ పంపా తీరమందలి అడవి ఫలాలను, మూలాలను సంపాదించి ఉంచానని” అంటూ, అభిమానంగా కందమూలా లను సమర్పించింది. అవి స్వీకరించిన రఘురాముడు –
ఏవముక్త: స ధర్మాత్మా శబర్యా శబరీమిదమ్‌
రాఘవ: ప్రాహ విజ్ఞానే తాం త్యమబహష్కృతామ్‌!!” (అ.74-19)
అన్నాడు. పరమాత్మ జ్ఞానాన్ని పొందిన ఈ శబరి విజ్ఞానముచె అబహష్కృతురా లు అని అర్థం. రాముని కోరిక మేరకు మతంగ ముని ఆశ్రమమంతా తిరిగి చూపించిన శబరి రామానుగ్రహాన్ని పొంది, యోగాగ్నిని ప్రజ్వలింప జేసుకొని అందులో ప్రవేశించి దివ్యాంబర ధారియై, దివ్యాభరణాలు, దివ్యమాలా విభూషితయై శబరి ఆమెకు అభీష్ట మైన, మహర్షులు నివసించే ఆనందమయ లోకాలకు వెళ్లిపోయింది.
మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభ
తవార్థే పురుష వ్యాఘ్ర పంపాయాస్తీర సంభవమ్‌! (అరణ్యకాండ 74- 17)
ఇది అందరికీ తెలిసిన కథ. వాల్మీకి రామాయణంలో శబరి ఎంగిలి పళ్లను రాము డు తిన్నట్లు రాయలేదని అనేకమంది పండితులు భావిస్తున్నారు. పద్మ పురాణంలో చెప్పినట్లు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు యోగ్యమైన వాటిని పరీక్షించి ఇవ్వాలనే మర్యాద శబరి పాటించిందన్న సమర్థనలున్నాయి. ఒక్కో చెట్టు పళ్లు ఎలా ఉన్నాయో రుచి చూసి పుల్లగా లేని, మధురంగా ఉన్న చెట్ల పళ్లనే రామునికిచ్చింది. గానీ, ఎంగిలి పళ్లు కాదని పురాణ కథనం. మన్యంలో వికసించిన పూజాసుమంగా కీర్తిస్తూ శబరి స్మృతి యాత్రను భదాద్రి దేవస్థానం ప్రతి సంవత్సరం నిర్వహస్తోంది. ఆధ్యాత్మికంగా మాత్రం శబరి అం టే మనకు అనన్య సామాన్య శ్రీరామభక్తురాలిగా సుపరిచితం. ఎంతో భక్తితో రాముని సేవించిన శబరికి చివరికి రాముని అనుగ్రహం లభించింది. అదీ శబరి తల్లి భక్తి ప్రపత్తి. కారణజన్మురాలంటే ఆమే! రాముని దర్శనానికై జీవితాంతం భక్తితో వేచియుండి చివ రికి రామ దర్శనం పొందిన ధన్యజీవి. గీతాచార్యుడు చెప్పినట్లు ప్రతిఫలం ఆశించ కుండా ఫలం, పుష్పం, తోయం ఏది సమర్పించినా దైవానుగ్ర#హం లభిస్తుందని భక్త శబరి గాథ తెలియ జేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement