Thursday, May 9, 2024

11 సార్లు ఓడిపోయాడు… ఇంకా పోటీ చేస్తానంటున్నాడు !!

ఇదిగో పైన కనిపిస్తున్న… అతని పేరు మర్రి నెహెమ్యా. ఇతని వయస్సు 72 ఏళ్లు. అయితే నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన మర్రి నెహెమ్యా ఎన్నికలు ఏవైనా సరే తానెప్పుడూ పోటీకి సిద్ధం అంటూనే ఉంటాడు. కౌన్సిలర్ నుంచి శాసనసభ, లోక్సభ స్థానాలకు కూడా నెహెమ్యా పోటీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం పదకొండు సార్లు పోటీ చేసి ఓటమి చెందాడు.

ఇక ఇప్పుడు తాజాగా మరోసారి సాగర్ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నాడు. 2014లో నల్గొండ లోక్సభ స్థానానికి పోటీ చేసి 56 వేల ఓట్లు సాధించాడు. ఇక అదే ఉత్సాహంతో తనను గెలిపించి వరకు ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉంటానని నెహెమ్యా చెబుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement